ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నత పాత్ర: మంత్రి శ్రీనివాస్

ABN, First Publish Date - 2022-02-15T18:01:53+05:30

స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నతమైన పాత్ర అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నతమైన పాత్ర అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం గత పాలక వర్గాలు లంబడాలను పూర్తిగా విస్మరించాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత దేశంలోనే తొలిసారిగా హమారా తాండామే హమారా రాజ్ అన్న నినాదాన్ని సాకారం చేస్తూ సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రంలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి 1000 గజాలు కేటాయిస్తూ నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో గిరిజన మహిళా హాస్టల్, గిరిజన భవన్, గిరిజన వసతి గృహం లాంటి ఎన్నో నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో సేవాలాల్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వెల్లడించారు. గిరిజన సంక్షేమం కోసం అజన్మాంతం శ్రమిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-15T18:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising