ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahabubabad: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఘటనపై మంత్రి Satyavati దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2022-06-21T19:52:08+05:30

జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్(Satyavati rathod) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ శశాంకతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి...ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి  తెలుసుకున్నారు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి వెంటనే తదుపరి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. 



కాగా.. జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అందనాలపాడులోని రామాలయం గుడికి సౌండ్ మైకులు కడుతుండగా విద్యుత్ షాక్ తగలింది. మైకులు కట్టె పైపు ఇనుపది కావడం వలనే విద్యుత్ షాక్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతులు సుబ్బరావు(67), మస్తాన్ రావు(57), వెంకయ్య (55)గా తెలుస్తోంది. ముగ్గురు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మైకులు కట్టే సమయంలో విద్యుత్ మెయిన్ లైన్ తీగలు కిందపడి ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

Updated Date - 2022-06-21T19:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising