ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులు: మంత్రి sabitha reddy

ABN, First Publish Date - 2022-06-13T16:43:22+05:30

మొదటి రోజు స్కూల్స్‌కు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మొదటి రోజు స్కూల్స్‌కు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నగరంలోని మెహబూబియా స్కూల్‌కు వచ్చిన మంత్రి... స్కూల్స్ రీ ఓపెన్  సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం సబితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...మన ఊరు మనబడి కింద స్కూళ్లను డెవలప్ చేస్తున్నామన్నారు. 9 వేల కోట్లతో 26 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇంగ్లీషు మీడియా మొదలు పెట్టామని... ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయన్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియా ప్రవేశ పెట్టిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.


గురుకులాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. గురుకులాలల్లో సీటు కోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్నారు. బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని, లోపాలు వెతికే ప్రయత్నం చేయవద్దని అన్నారు. మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం చేస్తున్న పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతియేటా మాదిరిగా జులై మొదటి, రెండో వారంలో పుస్తకాలు, యూనిఫార్మ్స్ అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2022-06-13T16:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising