ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాసర ఘటనపై మంత్రి Sabita indrareddy సీరియస్

ABN, First Publish Date - 2022-06-15T17:41:00+05:30

బాసర ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బాసర ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita indrareddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వీసిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని సబిత చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు బాసరలో కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాసరలో గోడ దూకి విద్యార్థులను రెచ్చ గొట్టి రోడ్లపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వీసీపై ఏవైనా ఇబ్బందులు ఉంటే విద్యాశాఖ మంత్రిగా తనకు ఫిర్యాదు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అధికారులతో రివ్యూ అనంతరం మంత్రి సబితా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. 


రెండో రోజు విద్యార్థుల ఆందోళన

మరోవైపు బాసర ఆర్జీయూకేటీలో రెండోరోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వేలాది మంది విద్యార్థులు మెయిన్ గేటు వైపుకు దూసుకొచ్చారు. మెయిన్ గేటు వద్ద విద్యార్థుల ధర్నా కొనసాగుతోంది. అకాడమిక్, వసతిగృహం సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్  చేస్తున్నారు. 

Updated Date - 2022-06-15T17:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising