మహిళా భద్రతలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: మంత్రి సబిత
ABN, First Publish Date - 2022-03-04T17:36:23+05:30
కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు పెద్దపీట వేశారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు.
హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు పెద్దపీట వేశారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీరిచ్చి మహిళా సమస్యలు తీర్చారని తెలిపారు. షీ టీమ్, భరోసా కేంద్రాలు పెట్టి మహిళా రక్షణ చర్యలు చేపట్టారన్నారు. మహిళా భద్రతలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని మంత్రి పేర్కొన్నారు. పోలీస్ శాఖలో 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్‌ది అని అన్నారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో మహిళ లకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు. మహిళల కోసం పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారన్నారు. మహిళల కోసం ఇంత చేసిన కేసీఆర్ మహిళా బంధు అని కొనియాడారు. ప్రతీ మహిళా... మహిళా దినోత్సవంలో భాగం కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
Updated Date - 2022-03-04T17:36:23+05:30 IST