ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ సదస్సులతో మారనున్న సాగు దశ-దిశ:Niranjan reddy

ABN, First Publish Date - 2022-06-26T22:12:25+05:30

తెలంగాణలో రైతులకు అవసరమైన సలహాలు,సూచనలతో కూడిన సదస్సులతో వ్యవసాయ రంగం దశ-దిశ మారుతుందని వ్యవసాయ శాఖ(agriculture department) మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో రైతులకు అవసరమైన సలహాలు,సూచనలతో కూడిన సదస్సులతో వ్యవసాయ రంగం దశ-దిశ మారుతుందని వ్యవసాయ శాఖ(agriculture department) మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) అన్నారు. రైతులుకూడా పంటల వైవిద్దీకరణకు మొగ్గు చూపుతున్నారని అన్నారు.సాగునీటి రాకతో తెలంగాణలో వరిసాగు అనూహ్యంగా పెరిగిందని మంత్రి తెలిపారు.రాష్ట్రంలో వ్యవసాయ సదస్సుల(meetings) విజయవంతానికి సహకరించిన అందరికీ మంత్రి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. అవసరానికి మించిన వరి సాగు వల్ల కలిగే దుష్పరిణామాలను గమనించి దేశంలో తొలిసారి వ్యవసాయ సదస్సులు నిర్వహించినట్టు మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు మూలంగా సాగునీటి రాకతో2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 34 లక్షల ఎకరాలు నుండి 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు సాగు పెరిగిందన్నారు.


2014 నాటికి 45 లక్షల టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులకు చేరిందన్నారు. రూ.లక్షన్నర కోట్లతో సాగు నీటి ప్రాజెక్టులు, రూ.28,473 కోట్లు వెచ్చించి వ్యవసాయ విద్యుత్ మౌళిక సదుపాయాలు, ఏటా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు అందిస్తున్నామని తెలిపారు.రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు రూ.50,447.33 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. 28వ తేదీ నుండి రైతుల ఖాతాలలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు జమకానున్నాయని చెప్పారు. రైతుభీమా పథకం ద్వారా ఇప్పటివరకు 83,118 మంది రైతు కుటుంబాలకు రూ.4150.90 కోట్లు పరిహారం అందజేశామన్నారు.


సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసర్చ్ & అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా 20 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపు కొనసాగుతున్నదని చెప్పారు.వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగుతో పాటు పప్పు, నూనెగింజల సాగుకు ప్రోత్సాహం. కందులు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పప్పుశెనగ, పొద్దుతిరుగుడు, మినుములు, పెసలు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని తెలిపారు.



రైతువేదికలలో సమావేశాలతో పాటు, క్షేత్రస్థాయి పర్యటనలతో వ్యవసాయ అధికారులు రైతులను పంటల మార్పిడి దిశగా చైతన్యం చేయాలన్నారు. రైతులతో వ్యవసాయ అధికారుల అనుబంధం మరింత పెరగాలని అన్నారు. ఏప్రిల్ 25 నుండి జూన్ 24 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, గ్రామ, మండలస్థాయి రైతుబంధు సమితుల ప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీచైర్మన్లతో  నిర్వహించిన 17 వ్యవసాయ సదస్సులు విజయవంతం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. 


Updated Date - 2022-06-26T22:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising