ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ శాఖ Call Centre ప్రారంభం

ABN, First Publish Date - 2022-06-22T23:50:02+05:30

తెలంగాణ వ్యవసాయ శాఖ కాల్ సెంటర్(agri culture call centre) ప్రారంభమైంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని రైతుబంధు సమితి(rytu bandhu samiti) అధ్యక్షుడి కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖ కాల్ సెంటర్(agri culture call centre) ప్రారంభమైంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని రైతుబంధు సమితి(rytu bandhu samiti) అధ్యక్షుడి కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేశారు.బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) ఈ కాల్ సంటర్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాల్ సెంటర్ ద్వారా రైతుబంధు, రైతుభీమా అమలు, పంటల వైవిధ్యీకరణ వివరాలు తెలుసుకునేందుకు అవకాశం వుంటుందన్నారు. రాష్ట్రంలోని 63 లక్షలమంది రైతుల ఫోన్ నంబర్లు వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు.రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు త్వరలో టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు.


రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని మంత్రి పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతులకు మరింత చేరువ అవుతామని అన్నారు.త్వరలోనే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి యధావిధిగా జమఅవుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థిక శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, శాసనమండలి సభ్యులు ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-22T23:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising