ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి పై ఆంక్షలు కాదు...లాభ సాటి పంటలే: నిరంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2022-04-21T23:40:05+05:30

తెలంగాణలో పంటల మార్పడిలో భాగంగా ప్రభుత్వం వరి పంట వేయద్దని అంటున్నదే కానీ వరి పై ఆంక్షలు కాదని, లాభ సాటి పంటలే అని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో పంటల మార్పడిలో భాగంగా ప్రభుత్వం వరి పంట వేయద్దని అంటున్నదే కానీ వరి పై ఆంక్షలు కాదని, లాభ సాటి పంటలే అని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.తెలంగాణ రైతన్న అన్నదాత మాత్రమే కాదు... వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చే స్పూర్తి ప్రదాత కావాలన్నదే సీఎం కేసిఆర్  ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. రైతన్న పంట తో మార్కెట్ వరకు పోవడం కాదు....తెలంగాణ రైతు పంట కల్లం కాడికే మార్కెట్ రావాలన్నదే ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనఅని చెప్పారు. గురువారం ఆయన ఒక ప్రకటన చేస్తూ వ్యవసాయం పట్ల ప్రభుత్వ చిత్త శుద్ది కొందరు స్వార్థ పరులకు  అర్థం కాకున్నా....రైతన్నలు అర్థం చేసుకున్నరు...కాబట్టే ప్రత్యామ్నాయ పంటల దిశగా సాగుతున్నరని చెప్పారు. 


యాసంగిలో ఇక్కడ పండే వరి ధాన్యం నుండే ఎక్కువ నూకలు వస్తాయని మొదటి నుండి చెబుతున్నామని, ఇది కూడా కేంద్రం సృష్టించిన సమస్యని అన్నారు. తెలంగాణ ప్రాంత పరిస్థితుల నేపథ్యంలోె కేంద్ర ప్రభుత్వ ధాన్యం సేకరణ నిబంధనల నుండి సడలింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది లేదా కేంద్ర ప్రభుత్వం నేరుగా బియ్యంతో సంబంధం లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని చెబుతున్నాం.యాసంగిలో తెలంగాణ నుండి వచ్చే వడ్లు  కొనం అని కేంద్రం స్పష్టంగా చెబుతున్నది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. వానాకాలం ఎవరి ఇష్టం వారిదని, ఈ విషయంలో ఆంక్షలు లేవని మంత్రి తెలిపారు. అయితే వరికి మించి లాభదాయకంగా ఉన్న పత్తి, కంది, పెసలు, మినుముల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-04-21T23:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising