ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చొప్పదండి సహకారసంఘానికి జాతీయ స్థాయి అవార్డు

ABN, First Publish Date - 2022-04-18T21:45:04+05:30

జాతీయ స్థాయిలో చొప్పదండి పీఏసీఎస్ కి మూడు సార్లు అవార్డు రావడం అభినందనీయమని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జాతీయ స్థాయిలో చొప్పదండి పీఏసీఎస్ కి మూడు సార్లు అవార్డు రావడం అభినందనీయమని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వచ్చే సంవత్సరం జాతీయ స్థాయిలో మొదటి స్థానంలోనిలిపేందుకు పాలకవర్గం కృషి చేయాలని అన్నారు. చొప్పదండి పీఏసీసీకి జాతీయ స్థాయిలో అవార్డు రావడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి సన్మానించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చొప్పదండి కి 2019- 20 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో నాఫ్ కాబ్ కు  3వఅవార్డులు రావడం అభినందనీయమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 


ఈ స్పూర్తితో చొప్పదండి సహకారసంఘానికి జాతీయ స్థాయి అవార్డు రావడంతో చొప్పదండి సహకార సంఘం పాలకవర్గ సభ్యులను హైదరాబాద్ లోని మంత్రుల నివాససముదాయంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మట్లాడుతూ చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం రైతులకు చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో 3వ స్థానంలో అవార్డు రావడం అభినందనీయం అన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘాన్ని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలని, సహకార స్ఫూర్తిని పెంచాలని సూచించారు. సంఘం ఏర్పాటు చేసినప్పటినుండి రైతులకు చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం అన్ని సంఘాలకు ఆదర్శంగా ఉన్నదని,  రైతులకు ఉత్తమసేవలు అందిస్తుందని అన్నారు.


సంఘం అభివృద్ధి కొరకు గత పాలక వర్గం, ఇప్పటి పాలక వర్గ కృషి తోనే సంఘం అభివృద్ధి చెందుతుందని అభినందించారు.ఇతర సంఘాలలో ఎక్కడా లేని విధంగా చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం సంఘ సభ్యులకు ప్రమాధభీమా, కుటుంబం లోని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం హర్షనీయమని అన్నారు. ఇదే స్పూర్తితో రైతులకు మరిన్నీ సేవలందించి వచ్చే సంవత్సరం మొదటి స్థానంలో నిలిపేందుకు పాలక వర్గం కృషి చేయాలని కోరారు. ఈనెల 22న  రోజున చత్తీస్గడ్ రాష్ట్రం రాయపూర్ నందు  నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగంగా దీందయాల్ ఉపాధ్యాయ ఆడిటోరియం లో అవార్డు అందుకోనున్నారు.

Updated Date - 2022-04-18T21:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising