ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది కేసీఆర్ సర్కార్ మాత్రమే

ABN, First Publish Date - 2022-01-18T20:22:20+05:30

దేశంలో రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచింది కేసీఆర్ సర్కార్ మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: దేశంలో రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచింది కేసీఆర్ సర్కార్ మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పధకాలతో రైతులను ఆదుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. అకాల వర్షాల వల్ల రైతులకు చేతికి వచ్చిన పంట దెబ్బతినడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమతి ప్రెసిడెంట్ పల్లా రాజేశ్వరరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం జిల్లాలోని భూపాలపల్లి, మంథని, నర్సంపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. పంటలను పరిశాలించారు. 


ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలు పెద్దయెత్తున పంటలను దెబ్బతీశాయన్నారు. రైతులు ఎదరూ ఆందోళన పడవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. దేశ పాలకుల అసంబద్ధ విధానాల వల్ల రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు. వ్యవసాయ విధానాలు లోప భూయిష్టంగా వున్నాయన్నారు. నష్టపోయిన రైతుల పంటల వివరాలు వ్యవసాయశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సేకరిస్తారని చెప్పారు. పరిస్థితిని సీఎం కేసీఆర్ వివరించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పరకాల, నర్సంపేట, భూపాలపల్లి పరిధిలో ఎక్కువ పంట నష్టం జరిగిందన్నారు. 

Updated Date - 2022-01-18T20:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising