ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్చే దిన్‌ వచ్చాయి... కంగ్రాట్స్‌: KTR ట్వీట్

ABN, First Publish Date - 2022-07-06T15:45:15+05:30

దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ ధరలు పెరగడంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ ధరలు పెరగడంపై మంత్రి కేటీఆర్‌(KTR) ట్వీట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘అచ్చే దిన్‌ వచ్చాయి... కంగ్రాట్స్‌’’ అంటూ విమర్శలు గుప్పించారు. గ్యాస్‌ ధర‌ను మరోసారి పెంచి దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Naredra modi) గిఫ్ట్‌ ఇచ్చారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 


కాగా... దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఎల్పీజీ ధర సిలిండరుపై రూ.50 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.1,003 నుంచి రూ.1,053కి చేరింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 14.2 కిలోల ధర రూ.50 పెరిగింది. హైదరాబాద్ నగరంలో రూ.1055 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1105కు పెరిగింది. ఈరోజు నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మార్చి 22న కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. అంతకుముందు 2021 అక్టోబర్, 2022 ఫిబ్రవరి నెలల మధ్య దేశీయ ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ.899.50గా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. 



Updated Date - 2022-07-06T15:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising