ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.495కోట్లతో హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలు: కేటీఆర్

ABN, First Publish Date - 2022-04-19T18:23:48+05:30

రూ.495 కోట్లతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్య్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రూ.495 కోట్లతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్య్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం పాతబస్తీలో పర్యటిస్తున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ... మోజం జాహి మార్కెట్‌ను అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సంద్భంగా సర్దార్ మహల్‌ను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. రూ.109 కోట్లతో బహదూర్ పురా ఫ్లై ఓవర్‌ను నిర్మాంచామని అన్నారు. మిరాలం చెరువు వద్ద ఎస్‌టీపీ నిర్మాణానికి శంకుస్థాపన, ట్రాన్స్ఫర్ స్టేషన్, కలెక్షన్ పాయింట్‌ను ప్రారంభించామని మంత్రి చెప్పారు. కొన్ని మెట్రో నగరాల్లో మంచి నీటి కష్టాలు ఉన్నాయని, కానీ మన దగ్గర మంచినీటికి, కరెంట్‌కు ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. కులి కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. మత విద్వేషాలను రెచ్చ గొట్టి కొందరు పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టే వారిని ఒక కంట కనిపెట్టల్సిన బాధ్యత అందరిదన్నారు. మత ఘర్షణల్లో చలి మంటలు కాచుకొంటున్న వారిని తరిమి కొడదామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-04-19T18:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising