ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మలా సీతారామన్‌పై మంత్రి కేటీఆర్ సెటైర్లు

ABN, First Publish Date - 2022-09-23T16:00:50+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Central Finance Minister Nirmala Sitharaman)పై మంత్రి కేటీఆర్ (Minister KTR) సెటైర్లు వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Central Finance Minister Nirmala Sitharaman)పై మంత్రి కేటీఆర్ (Minister KTR) సెటైర్లు వేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీని కవర్ చేసే పనిలో ఆర్థిక మంత్రి ఉన్నారన్నట్టుగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. మేడమ్ FM PDS షాపుల్లో PM ఫోటోల కోసం వెతుకుతూ బిజీగా ఉన్నారు. రూపాయి దాని సహజ స్థితికి చేరుకుంటుందని ఆమె మీకు చెబుతుంది. అన్ని ఆర్థిక కష్టాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం యాక్ట్స్ ఆఫ్ గాఢ్‌లో భాగమే. విశ్వ గురువు గారికి నమస్కారం’’ అంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా.. ఫారెక్స్‌ మార్కెట్‌ (Farex Market) గురువారం భారత కరెన్సీ (Indian Currency) రూపాయి భారీగా పతనమైంది. ఒక్క రోజులోనే 83 పైసలు దిగజారి 80.79 వద్ద క్లోజైంది. రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయి ఇదే. అంతేకాదు, ఈ ఏడాది రూపాయి నమోదు చేసిన భారీ పతనాల్లో ఇదొకటి. ఫిబ్రవరి 24వ తేదీన 99 పైసలు నష్టపోయిన తర్వాత రెండో పెద్ద నష్టం ఇది. గురువారం ఉదయం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్ (Inter bank Farex Market) డాలర్‌ మారకంలో రూపాయి 80.27 వద్ద ప్రారంభమై ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 80.95ని తాకింది. చివరికి ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 83 పైసల నష్టంతో 80.79 వద్ద ముగిసింది. ఇతర ఆసియా దేశాల (Asian Countries) కరెన్సీలు కూడా చారిత్రక కనిష్ఠ స్థాయిలనే నమోదు చేశాయి. ఈ ఏడాది రూపాయి ఇప్పటి వరకు 6.5 శాతం మేర క్షీణించింది. 








Updated Date - 2022-09-23T16:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising