ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR Tweet: తెలంగాణకు 9 మెడికల్ కాలేజ్‌లు ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి అసత్య ప్రచారం

ABN, First Publish Date - 2022-10-01T16:37:16+05:30

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy)పై మంత్రి కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి(Union minister) అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి (Telangana minister) ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘తెలంగాణ (Telangana)కు 9 మెడికల్ కాలేజ్‌లు ఇచ్చినట్లు కిషన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారు... తప్పుడు ప్రచారంపై కేంద్రమంత్రికి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదు. హైదరాబాద్‌ (Hyderabad)లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మీరు ఆ తర్వాత ప్రకటించారు. ఎప్పటిలాగే, మీ గుజరాతీ బాస్‌లు దానిని వారి రాష్ట్రానికి మార్చారు. మళ్ళీ మీరు హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించారు. అయినప్పటికీ మీరు మీ తప్పుడు వాదనను సరిదిద్దుకోలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధాని మోదీ (PM Modi) సమాధానం చెప్పాలి. ఏపీఆర్‌ఏలో తెలంగాణకు గానీ, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గానీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు’’ అంటూ మంత్రి కేటీఆర్ (TRS Leader) ట్విట్ చేశారు. 



Updated Date - 2022-10-01T16:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising