ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi కి విజన్ కొరత.. అందుకే ఇలా.. : కేటీఆర్ సంచలన ట్వీట్

ABN, First Publish Date - 2022-05-02T17:30:45+05:30

కేంద్రంపై ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలపై విమర్శలు గుప్పించే కేటీఆర్.. ఈసారి ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా మోదీపై ఆయన చేసిన విమర్శలు ఇటు తెలంగాణ.. అటు కేంద్రంలో హాట్ టాపిక్ అయ్యాయి.


మోదీకి విజన్ కొరత..!

‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత.. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత.. పరిశ్రమలకు కరెంట్ కొరత.. యువతకు ఉద్యోగాల కొరత.. గ్రామాల్లో ఉపాధి కొరత.. రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత.. వంటివన్నీ ఉన్నాయన్నారు. అయితే అన్ని సమస్యలకూ మూలం పీఎం మోదీకి విజన్ కొరత కావడమే అని కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు, మోదీ అభిమానులు మాత్రం ఘాటుగా రిప్లయ్ ఇస్తూ కౌంటర్ ఎటాక్‌ చేస్తున్నారు. ఈ ట్వీట్‌పై రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.



Updated Date - 2022-05-02T17:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising