ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ అధికారులు బాగా పని చేస్తున్నారు:కేటీఆర్

ABN, First Publish Date - 2022-01-02T00:25:16+05:30

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ అధికారులందరూ బాగా పనిచేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశంసించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ అధికారులందరూ బాగా పనిచేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశంసించారు. ఉద్యోగుల పనితీరుతో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. తద్వారా ఎన్నో కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. శనివారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర కేలండర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా రాణిస్తూ అనేక అవార్డులను సాధించిందన్నారు. అధికారులందరూ ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తూ మరింత అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు.


 ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను నిరంతరం ప్రగతి పథంలో దూసుకెళ్లేలా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగాలను సైతం లెక్కచేయకుండా స్వరాష్ట్రం కోసం ఉద్యోగులందరూ ఉద్యమించారని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో మరింత కష్టించి పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. ఈ టీజీవో ప్రెసిడెంట్ మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, అసోసియేషన్ నాయకులు రవీందర్ కుమార్, సహదేవ్, రవీందర్ రావు, అరుణ్ కుమార్, వెంకటయ్య, సుజాత, నగర శాఖ ప్రెసిడెంట్ గండూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-02T00:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising