ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి మంత్రి కేటీఆర్‌ సవాల్‌

ABN, First Publish Date - 2022-04-21T01:43:59+05:30

బీజేపీకి మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. తాను చెప్పేది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: బీజేపీకి మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. తాను చెప్పేది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నేడు హనుమకొండ, నర్సంపేటలో కేటీఆర్‌ పర్యటించారు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బుధవారం సాయంత్రం బాలసముద్రంలోని హయగ్రీవచారి గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తాను సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతానని తెలిపారు. కేంద్రానికి రూ.3,65,797 కోట్లు ఇచ్చామని, తెలంగాణకు కేంద్రం రూ.కోటి 65 లక్షలు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ రాకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఎవడీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము బూతులు తిట్టగలం.. కానీ తమకు సంస్కారం ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ బఫూన్‌ పార్టీ అని ఎద్దేవాచేశారు. మోదీ గుజరాత్‌కే ప్రధాన మంత్రా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలుపుతారని, బీజేపీ దీనికి కూడా వెనకాడదని చెప్పారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై ఎప్పుడైనా మోదీని కలిశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-21T01:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising