ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ గురుకుల విద్యార్థులకు ల్యాప్ టాప్స్,చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

ABN, First Publish Date - 2022-01-12T21:48:22+05:30

అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీ గురుకులాలలో చదివి ఎంబిబిఎస్,బిడిఎస్, ఐఐటి,ఎన్ఐటిలలో సీట్లు పొందిన విద్యార్థి,విద్యార్థులకు ప్రోత్సాహాక బహుమతులు అందజేశారు. హైదరాబాద్ మంత్రుల నివాసంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మంత్రి 100 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్స్,చెక్కులను పంపిణీ చేశారు.

 

2018-19,2019-20 విద్యా సంవత్సరాలలో ఐఐటి, ఎంబిబిఎస్ కోర్సుల్లో సీట్లు పొందిన వారికి 50 వేలు,ఎన్ఐటి,బిడిఎస్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు 40 వేల చొప్పున మంత్రి చెక్కులు అందజేశారు. ఐఐటి విద్యనభ్యసిస్తున్న వారికి ల్యాప్ టాప్స్ పంపిణీ చేశారు.విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహాకంగా 92 లక్షల 40 వేలు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. అన్ని రంగాలతో పాటు ఉన్నత విద్యలో కూడా  తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ప్రారంభించారని మంత్రి తెలిపారు. తెలంగాణ గురుకుల విద్యార్థులు పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ ఫలితాలతో పాటు జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతున్నారని మంత్రి వివరించారు.

Updated Date - 2022-01-12T21:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising