ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణా టాప్-మంత్రి జగదీష్ రెడ్డి

ABN, First Publish Date - 2022-02-03T01:44:30+05:30

మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి లో తెలంగాణా రాష్ట్రానికి వరంగల్ రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన చెప్పారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ముందు చూపు నిర్ణయాలే కారణమని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని ‘నుడా’ గా మార్చిన నేపద్యంలో వరంగల్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి నల్లగొండలో నిర్మాణాలు చేపట్టేందుకు గాను మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి సూర్యపేట, నల్లగొండ మున్సిపల్ కమిషనర్లు రమణా చారి,రామంజుల్ రెడ్ది లతో పాటు మున్సిపల్, పబ్లిక్ హెల్త్,టూరిజం ఇంజనీర్ల బృందం బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు.


ఈ సందర్భంగా అంబెడ్కర్ జంక్షన్, కాళోజీ కళాక్షేత్రం,జైన్ టెంపుల్,భద్రకాళి బండ్ ను సందర్శించారు. అనంతరం ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ,మేయర్ గుండు సుధారాణి లతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్మిస్తున్న నిర్మాణాలు కాకతీయులు,కాళోజీ ,ఆచార్య జయశంకర్ చరిత్ర కు ప్రతిరుపాలని ఆయన అభివర్ణించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మరిని పారద్రోలిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. ఉద్యమాలతో పాటు అభివృద్ధి కి ఓరుగల్లు దిక్సూచి గా నిలిచిందన్నారు.పట్టణాభివృద్ధి లో రాష్ట్ర పురపాలక మరియు ఐటి మంత్రి కేటీఆర్ కు సరిరారు ఎవ్వరు అంటూ ఆయన కితాబిచ్చారు. ప్రపంచ దేశాల నుండి అందుతున్న ఆహ్వానాలు, ప్రశంశలు అందుకు అద్దం పడుతున్నాయన్నారు.


Updated Date - 2022-02-03T01:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising