ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Jagadish Reddy: అమిత్‌షా వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం

ABN, First Publish Date - 2022-08-22T03:22:31+05:30

కేంద్రమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కేంద్రమంత్రి అమిత్‌షా (Central Minister Amit Shah) వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagadish Reddy) కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) బీజేపీలో చేరికతో కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే సమయం ప్రారంభమైందని మునుగోడు (Munugodu)లో సభలో అమిత్ షా అన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి జగదీశ్ రెడ్డి  ఖండించారు. అమిత్‌షా వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్‌షాకు స్క్రిప్ట్ సరిగా రాసివ్వనట్లుందని ఎద్దేవా చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలు దొంగే దొంగా అన్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమిత్‌షా మాటల్లో అసత్యాలు, అక్కసు తప్ప.. ఇంకేం వినిపించలేదన్నారు. ఓట్లు, సీట్లు, అధికారం తప్ప.. వారికి ఇంకో యావ లేదని విమర్శించారు. మునుగోడు ప్రజలు బీజేపీకి మీటర్ పెట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. మునుగోడు బైపోల్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-08-22T03:22:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising