ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృతి,సంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరు: Jagadish reddy

ABN, First Publish Date - 2022-05-30T01:07:16+05:30

సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణా పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి(jagadish reddy) పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణా పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి(jagadish reddy) పేర్కొన్నారు. యావత్ ప్రపంచంలో ఎక్కడా ఏ జాతికి లేని సాంస్కృతిక వారసత్వం ఒక్క తెలంగాణా కు మాత్రమే కలిగి ఉండడం మన అదృష్టం అని ఆయన చెప్పారు.ప్రపంచంలో ఎన్నో జాతులు వచ్చి పోయాయని ప్రస్తుతం ఉన్న మూడు వేల పై చిలుకు జాతులలో ఒక్క తెలంగాణ కు మాత్రమే మానవీయ కోణాన్ని ఆవిష్కరించే రీతిలో అంగం ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన బతుకమ్మ సంప్రదాయం మనకు సొంతం అయిందన్నారు.అటువంటి బతుకమ్మ వారసత్వాన్ని కొనసాగించే గురుతరమైన బాధ్యత నేటి తరం మీద ఉందన్నారు.


అమెరికాలోనీ న్యూజెర్సీలో మూడురోజులుగా జరుగుతున్న తెలంగాణా అమెరికా తెలుగుసంఘం (TTA) మేఘా కనివేన్షన్ ను న్యూజెర్సీ కనివేన్షన్ కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.tta ప్రతినిధి ఫైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన సంస్కృతి సంప్రదాయాలను వర్తమాననికి అందించాలని ఆయన కోరారు. అందులో ప్రవాసులు ముందుండలన్నారు.బతుకమ్మ తో పాటు బోనాలు,గ్రామదేవతల పేరుతో నిర్వహించే జాతరల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవచ్చు అని ఆయన తెలిపారు. 


ఎన్నోవ్యయ ప్రయసాల కోర్చితెలంగాణా ఉనికిని అమెరికాలో చాటేందుకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు పోతున్న (TTA )తెలంగాణా అమెరికా తెలుగు సంఘాన్ని ఆయన అభినందించారు.ప్రవాసులు పుట్టి పెరిగిన చోట ఇప్పటికి ప్రభుత్వ సేవలు అందని పక్షంలో అక్కడ సేవలు అందించెందుకు ప్రవాసులు ముందుకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.TTA ప్రస్తుత చైర్మన్ మోహన్ రెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.ఈసందర్భంగా  మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి తెలంగాణా అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

Updated Date - 2022-05-30T01:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising