ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టంపై సమగ్ర నివేదికలను సిద్దం చేయండి:Indrakaran reddy

ABN, First Publish Date - 2022-07-16T21:21:13+05:30

జిల్లాలో భారీ వర్షాలు, వరదలు(floods) కారణంగా జరిగిన నష్టాలపై మండలాల వారీగా స‌మ‌గ్ర నివేదికలను సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) అధికారులను ఆదేశించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో భారీ వర్షాలు, వరదలు(floods) కారణంగా జరిగిన నష్టాలపై  మండలాల వారీగా స‌మ‌గ్ర నివేదికలను  సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) అధికారులను ఆదేశించారు.భారీ వ‌ర్షాల వ‌ల్ల జిల్లాలో జ‌రిగిన న‌ష్టం, స‌హాయ‌క చ‌ర్యల‌పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నిశాఖల అధికారులతో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.  జిల్లా యంత్రాంగం చేప‌ట్టిన సహాయక చర్యలు,ఆస్తి,పంట న‌ష్టం, బాధితుల‌కు అందుతున్న స‌హాయం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. 


ఎడతెరపి లేని వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని,మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాల‌ని అధికారుల‌కు దిశానిర్ధేశం చేశారు. రైతు వారీగా వివరాలను సర్వేలో న‌మోదు చేయాల‌న్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సహాయక చర్యలను కొనసాగించాలన్నారు.ఈ స‌మావేశంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కోవాల క్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠ‌ల్, ఎమ్మెల్యేలు కోనేరు కోణ‌ప్ప‌, ఆత్రం స‌క్కు,  క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-16T21:21:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising