ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే: మంత్రి Indrakaran reddy

ABN, First Publish Date - 2022-06-20T21:35:53+05:30

అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) డిమాండ్ చేశారు.ప్రధాని మోదీ నేతృత్వంలోని  బీజీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అగ్నిపధ్ పై ఆయన స్పందించారు. అన్ని రంగాల్లోను దేశాన్ని అథోగతి పాలుచేసిన ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపత్(agnipath) ప్రకటించిందన్నారు.ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువకులు కధం తొక్కారని, ఇది మరింత పెద్దదిగా కాకముందే మోదీ మేలుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రధాని మోదీ ఇకనైనా ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరనడానికి రైతు ఉద్యమాలు, ఇలా అగ్నిపత్ పథక వ్యతిరేఖ  పోరాటాలే నిదర్శనమన్నారు.


అయితే హింసకు తావు లేకుండా శాంతియుత పద్దతుల్లో నిరసనలు తెలియజేయాలని మంత్రి కోరారు.ఓవైపున రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం  తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు ఉద్యోగాల నియామకాలు చేస్తుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశభద్రతను పణంగా పెట్టి అగ్ని పత్ లాంటి పథకం తెచ్చి దొడ్డిదారిన నియామకాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టిఆర్ఎస్ ఉందన్న బీజెపి పెద్దలు,మరి  బీహార్, హర్యానా, యుపిలో జరిగిన అల్లర్ల వెనుక కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నాయంటారా?మరి ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బిజెపికదా? అక్కడి ఆలర్లకు కారణమా? అనిప్రశ్నించారు. 

Updated Date - 2022-06-20T21:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising