ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజారోగ్యానికి పెద్దపీట: మంత్రి Indrakaran reddy

ABN, First Publish Date - 2022-06-17T20:19:51+05:30

ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: ప్రజల ఆరోగ్యానికి  ముఖ్యమంత్రి కేసీఆర్  అధిక ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్ స్టాండ్  ఏరియాలో నూతనంగా  నిర్మించిన బస్తీ దవాఖానను(basti dawakhana)మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పేదలకు మరింత దగ్గరగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు బస్తీ దవాఖానాలు ప్రారంభించామన్నారు.దీంతో ఇక్కడి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు.బస్తీ దవాఖానాల్లో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడం పాటు స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించడంతో పాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారన్నారు.


ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమ  ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, యోగ లాంటివి  చేసి శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు.గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు  ప్రబలి గిరిజన ప్రజలు  మరణించడం మనం చూశాం కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక వైద్య సేవలు మెరుగుపడ్డాయని, సీజనల్ వ్యాధులు, విష జ్వారాల వల్ల మరణాలను పూర్తి నిరోధించగలిగమని పేర్కొన్నారు. పచ్చదనం పరిశుభ్రత కు పెద్దపీట వేస్తూ పల్లె, పట్టణ  కార్యక్రమాలు  చెపట్టామని, ఈ నెల 18 తో పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం ముగుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఏం ఏం సమస్యలను పరిష్కరించ గలిగాము? రానున్న రోజుల్లో  పరిష్కారించాల్సిన  సమస్యలు ఏంటని? అధికారులు, ప్రప్రతినిదులు సమీక్ష చేసుకోవాలన్నారు.

Updated Date - 2022-06-17T20:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising