ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి Indrakaran reddy

ABN, First Publish Date - 2022-06-03T20:28:42+05:30

ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్.సీ.సీ, నిర్మ‌ల్ సైక్లింగ్ క్ల‌బ్(nirmala cycling club) ఆద్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని (cycle rally)అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) జెండా ఊపి ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మ‌ల్: ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్.సీ.సీ, నిర్మ‌ల్ సైక్లింగ్ క్ల‌బ్(nirmala cycling club) ఆద్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన  సైకిల్ ర్యాలీని (cycle rally)అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) జెండా ఊపి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్డేడియం నుంచి ప్రారంభ‌మైన ఈ ర్యాలీ మంచిర్యాల చౌర‌స్తా- చించోలి క్రాస్ రోడ్ - హ‌రిత‌వ‌నం- ఎన్టీఆర్ స్టేడియం వ‌ర‌కు కొన‌సాగింది. 15.5 కిలోమీట‌ర్ల ర్యాలీలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఉత్స‌హంగా పాల్గొని సైకిల్ తొక్కారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... శారీరకంగా దృఢంగా ఉండేందుకు సైకిల్ పై ప్రయాణం ఉపయోగపడుతుందన్నారు. సైకిల్​.. రవాణాకు ఉప‌యోగక‌ర‌మే కాకుండా, ఇంధన ఆదాకు ఉప‌యుక్త‌మైన‌దని చెప్పారు. 


వీలైనంత వరకూ సైకిల్​పై వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని కోరారు. కాలుష్యం తగ్గించడానికి వాహనాల వినియోగం తగ్గించాలని పిల‌పునిచ్చారు. అందుకు సైక్లింగ్‌ వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని ఆయ‌న అన్నారు. చిన్న వ‌య‌సు నుంచే పిల్ల‌ల‌కు సైక్లింగ్ చేయ‌డం అల‌వాటు చేసి వారిని ప్రొత్స‌హించాల‌ని సూచించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం (World Bicycle Day) సందర్భంగా.. సైకిల్​ అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిర్మ‌ల్ సైకిల్ క్ల‌బ్ లో స‌భ్యుల సంఖ్య మ‌రింత పెర‌గాలని అభిలాషించారు. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌కులు డా. రామ‌కృష్ణ‌తో పాటు సైకిల్ క్ల‌బ్ మెంబ‌ర్స్ కు అభినంద‌న‌లు తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పరిష‌త్ చైర్ ప‌ర్స‌న్ కె.విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి,  క‌లెక్ట‌ర్ ముశ్ర‌ఫ్ ఫారూఖీ అలీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-03T20:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising