ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

ABN, First Publish Date - 2022-02-05T22:59:28+05:30

నిర్మల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: నిర్మల్ పట్టణంలోని ఆర్టీసీ  బస్టాండ్ ను ఆర్టీసీ  చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బస్టాండ్ లో మౌలిక సౌకర్యాల పై అధికారులు ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఆర్టీసీ సంస్థకు చెందిన నిరుపయోగంగా ఉన్న స్థలాలను తమ అవసరాల మేరకు  ఆయా శాఖలు ఆర్టీసీకి నష్టపరిహారం చెల్లించి అభివృద్ది పనులు చేపట్టవచ్చని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు.


నిర్మల్ పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణాకి ఆర్టీసీ సంస్థకు చెందిన స్థలాన్ని  మున్సిపాలిటీకి కేటాయించినట్లు చెప్పారు. దీంతో మార్కెట్ నిర్మాణానికి  అడ్డంకులు తొలగిపోయాయి.ఆర్టీసి సంస్థకు నిర్మల్ మున్సిపాలిటీ డబ్బులు చెల్లించనుంది.అనంతరం మంత్రి మాట్లడుతూ సమీకృత మార్కెట్ నిర్మాణాకి ఇప్పటికే టెండర్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Updated Date - 2022-02-05T22:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising