ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జిల్లాల్లో.... త్వరలో జిల్లా జడ్జీ కోర్టులు

ABN, First Publish Date - 2022-02-08T20:25:51+05:30

కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జీ కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జీ కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.మంగళవారం అరణ్య భవన్ లో న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమావేశమై కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటు ప్రక్రియపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలు, బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త జిల్లాల్లో జిల్లా జడ్జీ కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హైకోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.


కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మినహా మిగిలిన అన్ని కొత్త జిల్లాల్లో ఇప్పటికే అదనపు జిల్లా జడ్జీ కోర్టులు ఉన్నాయి.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, రాష్ట్ర హైకోర్టు ఇదివరకు తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటు ప్రక్రియ పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు.ఆయా కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్నఅదనపు జిల్లా కోర్టుల ప్రాంగణంలోనే కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పడనున్నాయి.ఉమ్మడి జిల్లా కోర్టుల్లో ఉన్న కేసులన్నింటిని ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోర్టులకు ... ఆయా జిల్లాల పరిధిలోని కేసులను బదిలీ చేయనున్నారు. వివిధ అంశాలపై కోర్టులను ఆశ్రయించే వారికి సకాలంలో న్యాయం అందించేందుకు కొత్తగా ఏర్పాటు కానున్ జిల్లా కోర్టులు దోహదం చేయనున్నాయి. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో బాధితులకు తక్కువ సమయంలో న్యాయం అందించేందుకు వీలు కలుగనుంది.

Updated Date - 2022-02-08T20:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising