ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు బంధు సంబురాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిద్దాం

ABN, First Publish Date - 2022-01-03T21:22:39+05:30

తెలంగాణలో సోమవారం నుంచి వారం రోజుల పాటు జ‌రిగే రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైద‌రాబాద్: తెలంగాణలో సోమవారం నుంచి వారం రోజుల పాటు  జ‌రిగే రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. సోమ‌వారం అరణ్య భ‌వ‌న్ లో రైతు బంధు సంబురాల‌పై అందుబాటులో ఉన్న ప్ర‌జాప్ర‌తినిదుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేర‌కు రైతుబంధు సంబురాలను గ్రామ గ్రామాన అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు బాధ్య‌త తీసుకుని రైతులను, కార్య‌కర్త‌ల‌ను భాగ‌స్వామ్యం చేస్తూ ఈ  కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. 


సీఎం కెసిఆర్ ఎంతో దూరదృష్టి, దార్శనికతతో రైతుల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేయాల‌ని సంక‌ల్పంతో  రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టార‌న్నారు. రైతు బంధు కార్యక్రమం ద్వారా 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరనున్న సందర్భంగా మ‌న‌మంతా  ఓ పండుగ‌ల వారోత్స‌వాల‌ను జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపులతో వినూత్న కార్యాక్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని సూచించారు.ఈ స‌మావేశంలో పెద్ద‌ప‌ల్లి ఎంపీ వెంక‌ట్ నేత‌, ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, రాథోడ్ బాపురావు, రేఖా శ్యాంనాయ‌క్, విఠ‌ల్ రెడ్డి, ఆదిలాబాద్ జ‌డ్పీ  చైర్మ‌న్ రాథోడ్ జ‌నార్ధ‌న్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-03T21:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising