ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య ఆరోగ్యశాఖపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు: హరీష్

ABN, First Publish Date - 2022-01-29T16:58:20+05:30

వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం నాడు సత్తుపల్లిలో హరీష్‌రావు పర్యటించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం నాడు సత్తుపల్లిలో హరీష్‌రావు పర్యటించారు. వంద పడకల ఆస్పత్రికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం హరీష్‎ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్‎లు వచ్చిన తర్వాత వందశాతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీలు పెరిగాయన్నారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేశామని, కళ్యాణ లక్ష్మీ పథకం కింద 10 లక్షల పెళ్లిళ్లు జరిగాయని తెలిపారు. సంక్షేమ ప్రభుత్వానికి చిరునామాగా కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ తర్వాత ఒక్క ఖమ్మంలోనే కేతల్యాబ్ ఏర్పాటు చేసినట్లు హరీష్ వెల్లడించారు. రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే బాగా జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. ప్రజల సహకారం ఉంటే త్వరలోనే కరోనా వేవ్ నుండి బయటపడవచ్చని హరీష్ అన్నారు.

Updated Date - 2022-01-29T16:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising