ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghunandan rao: దమ్ముంటే తెలంగాణలో మూడోసారి గెలిచి చూపించాలి

ABN, First Publish Date - 2022-08-30T18:32:24+05:30

ఆర్థిక మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: ఆర్థిక మంత్రి హరీష్ రావు (Harish rao)పై ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి హరీష్ (Minister) తనపై, బీజేపీ ప్రభుత్వం (BJP Government) పై అబద్దపు ప్రచారం చేస్తూన్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఆదాయం ఎంత.. ఖర్చు ఎంత.. ఇప్పుడు ఎంత మంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు. అబద్దపు ప్రచారంలో హరీష్ రావు(TRs leaders) స్థాయిని దిగజార్చుకుంటున్నారని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 57 వేల పెన్షన్ అబద్దమన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఇండ్లే 50వేలు .. మరి 57వేలు ఫెన్షన్ ఎలా ఇస్తున్నారని ఎమ్మెల్యే నిలదీశారు.


ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించేందుకు తిరుగుతుండు అనడం బాధాకరమన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కాకుండా ఎవరు కత్తిరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మొన్ననే దుబ్బాక ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టింది గుర్తు లేదా అని వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ (TRS) గెలవకుంటే దుబ్బాక అభివృద్ధి ఆపడమా? ఇది సంస్కృతి కాదని అన్నారు. మూడు సంవత్సరాల నుంచి కేసీఆర్ స్కూల్ అట్లే ఉంటుందని.. దమ్ముంటే సీఎంతో ప్రారంభించాలన్నారు. దమ్ముంటే తెలంగాణ (Telanagana)లో మూడోసారి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ప్రజలు కట్టిన పన్నుతోనే సంక్షేమ పథకాలు.. దానికి గొప్పలు చెప్పడం ఎందుకు అని రఘునందర్ రావు (BJP Leader) వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-08-30T18:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising