ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యాధికారులతో మంత్రి HARISH RAO సమావేశం

ABN, First Publish Date - 2022-07-16T22:18:59+05:30

గోదావరి పరీవాహక వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు(Harish rao) అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గోదావరి పరీవాహక వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు(Harish rao) అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద బాధిత ముంపు ప్రాంతాల జిల్లా వైద్యశాఖ అధికారులు, డాక్టర్లతో ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. 


డాక్టర్లందరూ సెలవులు తీసుకోకుండా తప్పని సరిగా డ్యూటీలు నిర్వహిస్తూ ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తూ, మెడిసిన్లను ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరా చేయాలన్నారు. ఈ మేరకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావును కొత్తగూడెం కేంద్రంగా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డిని, మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహిస్తూ హెల్త్ క్యాంపులు తదితర ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 

Updated Date - 2022-07-16T22:18:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising