ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు అందుబాటులోకి అన్నిరకాల ప్రభుత్వ వైద్యసేవలు:Harish rao

ABN, First Publish Date - 2022-05-26T21:11:15+05:30

అన్ని రకాల ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish rao) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అన్ని రకాల ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish rao) అన్నారు. గురువారం ఆయన పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తో కలిసి అమీర్ పేట లోని 50 పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మొత్తం తిరిగి పరిశీలించారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి చికిత్స పొందుతున్న వారిని అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి, ఇక్కడకు చికిత్స కోసం వచ్చే వారికి మరింత మెరుగైన సేవలు అందించడానికి  తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి తలసాని హరీశ్ రావు కు వివరించారు. ముఖ్యంగా ఆసుపత్రిలో CT స్కాన్ ఏర్పాటు చేయాలని, కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని, జనరేటర్ ఏర్పాటు చేయాలని తదితర సౌకర్యాలు కల్పించాలని వివరించారు. స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ దశరథ, DMHO డాక్టర్ వెంకట్, TSMIDC MD చంద్రశేఖర్ రెడ్డి, CE రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-26T21:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising