ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని సందర్శించిన తెలంగాణ మంత్రి Gangula team

ABN, First Publish Date - 2022-05-28T22:58:37+05:30

కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి మందిర నిర్మాణం అతి త్వరలోనే కార్యరూపం దాల్చబోతుంది,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి మందిర నిర్మాణం అతి త్వరలోనే కార్యరూపం దాల్చబోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(ttd board) నిధులతో వారి ఆధ్వర్యంలో నిర్మించబోయే ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎంపీ దామోదరరావు, టిటిడి బోర్డు తెలంగాణ లోకల్ అడ్వైజరీ  కమిటీ చైర్మన్ భాస్కర్ రావు ఈరోజు అమరావతి(amaravati)లో నిర్మాణంలో ఉన్న వెంకటాచల టిటిడి ఆలయాన్ని సందర్శించారు. ఎకరా విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఆలయ ప్రాంగణాన్ని అణువణువు పరిశీలించారు.


ఈసందర్భంగా ఆగమ, వాస్తు శాస్త్రం, ఆలయ నిర్మాణ శైలి, గర్భాలయం, అంతరాలయం, అర్థ మండపం, మహా మండపం, ముఖమండపం, గరుడాళ్వార్ సన్నిధి, ధ్వజస్తంభం, బలిపీఠం, తూర్పు రాజ గోపురం, ఉత్తర ద్వారం, ప్రాకార మండపాలు తదితర నిర్మాణ విశిష్టతలను  ఆలయ స్థపతులను అడిగి తెలుసుకున్నారు.గతంలో జూబ్లీహిల్స్ టిటిడి ఆలయంతోపాటు కొన్నిఇతర ఆలయ నిర్మాణాలను సైతం పరిశీలించారు.కరీంనగర్ నగరం నడిబొడ్డున 100 కోట్ల విలువ చేసే పది ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ టిటిడి ఆలయ నిర్మాణం కోసం ఇదివరకే కేటాయించారు, ఈ ఆలయ నిర్మాణానికి టిటిడి బోర్డు సైతం గతంలోనే ఆమోదం తెలిపింది. గతంలో జూబ్లీహిల్స్ ttd ఆలయాన్నికూడా వారు పరిశీలించారు, అందులో భాగంగా ఈరోజు నిర్మాణంలో ఉన్న అమరావతి ఆలయాన్ని సందర్శించారు. 


టీటీడీ స్థపతులు, కరీంనగర్ రెవెన్యూ యంత్రాంగం, యాదాద్రికి పనిచేసిన ఆనంద్ సాయి తదితరులు కరీంనగర్లో ఆలయనిర్మాణం జరగబోయే స్థలాన్ని పరిశీలించి డిజైన్లు ఇవ్వాల్సిందిగా మంత్రి గంగుల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బృందాన్ని స్థానిక ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ అమరావతి ఆలయం కన్నా మరింత సుందరంగా, మరింత విశాలంగా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఆలయాన్ని నిర్మిస్తామన్నారు, ఇప్పటికే పూర్వ కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాలేశ్వరం తదితర పుణ్యక్షేత్రాలకు దీటుగా కరీంనగర్ టిటిడి ఆలయం ఉండబోతుంది అన్నారు.




Updated Date - 2022-05-28T22:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising