ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నిశాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలి:Gangula

ABN, First Publish Date - 2022-07-11T20:28:28+05:30

జిల్లాలోభారీ వర్షాల(heavy rains) నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జిల్లాలోభారీ వర్షాల(heavy rains) నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయని, రోడ్ల మీద నీళ్ళు నిలువకుండా చర్యలు చేపట్టాలని మంత్రి గంగుల  అధికారులను ఆదేశించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సహాయం అందించడానికి అన్నిశాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలని మంత్రి ఆదేశించారు.


సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మేయర్ వై సునీల్ రావు,డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి లతో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు.విద్యార్ధులకు ఇబ్బందులు కలగకూడదనే విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో వరద కారణంగా ఏర్పడే నష్టాలను ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. 

Updated Date - 2022-07-11T20:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising