ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: మంత్రి గంగుల

ABN, First Publish Date - 2022-04-13T16:58:54+05:30

రాష్ట్రంలో నేటి నుంచి రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో నేటి నుంచి రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బుధవారం ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి యాబై రోజులపైన పడుతుందన్నారు. మధ్య దళారులకు సంబంధం లేకుండా ఎంఎల్పీ ఇచ్చి తామే కొంటున్నామని తెలిపారు. ఇందుకోసం పదిహేను వేల కోట్లు ప్రభుత్వనికి భారం పడనుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు బ్యాంక్‌లను సంప్రదించినట్లు తెలిపారు. బ్యాంక్‌లు ముందుకు వచ్చాయన్నారు. ధాన్యం కొనుగోలు జరగగానే డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని అన్నారు. వాస్తవానికి గోదాములు అన్ని ఎఫ్సీఐ పరిధిలో ఉంటాయన్నారు. ఈసారి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గోదాముల కొరత ఉందని, ఇవాళ కలెక్టర్లతో సమావేశంలో చర్చించి గోదాముల పెంపుపై నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రల పెంపు అవసరాన్ని బట్టి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రోడ్డున పడేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అండగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 


Updated Date - 2022-04-13T16:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising