ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలప్పుడే రాజకీయాలు..మిగతా అంతా అభివృద్ధి మీదే: Gangula

ABN, First Publish Date - 2022-05-29T20:07:59+05:30

ఎన్నికలప్పుడే రాజకీయలని..మిగతా సమయంలోఅభివృద్ధిపైనే ధ్యాస వుంటుందని బీసీ,పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar)అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: ఎన్నికలప్పుడే రాజకీయలని..మిగతా సమయంలోఅభివృద్ధిపైనే ధ్యాస వుంటుందని బీసీ,పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar)అన్నారు. కొత్తపల్లి మండలం అసిఫ్ నగర్ లో బీజేపీ నుండి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమనికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1956 నుండి చరిత్ర చుస్తే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలేదు.పోటీ కూడా చేయలేదు.మీ ఆశీర్వాదం తో మూడు సార్లు గెలిచానని అన్నారు.తెలంగాణ రాక ముందు ఈ ప్రాంత పరిస్థితి ఏందో మీరే చూసారు.ఎక్కడ కూడా అభివృద్ధి కి నోచుకోలేదని,తాగునీరు, సాగునీటి కి అరిగోస పడ్డామని గుర్తు చేశారు.


ప్రజలకు ఏమి కావాలి అని ఆనాడు ఏ ప్రభుత్వం ఆలోచించ లేదని..కానీగ్రామాలు ఆర్ధికంగా ఎదగాలని టీ ఆర్ ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.మండుటెండలో నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వనికి దక్కిందని అన్నారు.కరెంట్ కావాలని ఆనాడు నేనే స్వయంగా రైతులతో కలిసి ఉద్యమం చేస్తే మాపై కేసులు నమోదు చేశారని అన్నారు.మన ప్రాంత అభివృద్ధి చూసి వందల పరిశ్రమలు వచ్చాయని,రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.ఇది మన అందరి కుటుంబ పార్టీ.మాకు అండగా ఉండండి..మీపై ఈగ వాలనివ్వము.అన్ని వేళలా అందుబాటులో ఉంటాము.త్వరలోనే గ్రామ..గ్రామన తిరుగుతా..మీ అందరి వద్దకు వస్తానని అన్నారు.


ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ లకు మంత్రులకు సవాల్ విసురుతున్నా మీరు పాలించే రాష్ట్రంలో ఈ అభివృద్ధి ఉందా?చర్చకు సిద్ధమా? అన్నారు.ఈ దేశంలో నిజమైన దేశ భక్తులు ఎవరు అంటే ఇక్కడి పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించే వారేనని అన్నారు. అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ధనికుల కోసమే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు.అన్ని ప్రైవేటీకరణ చేసి..అంబానీ..ఆధానిల ఇల్లు నింపుతున్నావని,రానున్న రోజుల్లో అంబానీ ఎక్స్ప్రెస్..ఆధాని ఎక్స్ప్రెస్ అని మాత్రమే ఉంటాయి.మోడీ ప్రభుత్వం ప్రజల నుండి దూరం అయింది..మన రాష్ట్రనికి బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు.

Updated Date - 2022-05-29T20:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising