ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ వచ్చాకనే వైకుంఠధామాల ఆధునీకరణ: మంత్రి గంగుల

ABN, First Publish Date - 2022-02-23T21:08:12+05:30

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని పౌరసరఫరాలు, బిసి వెల్పేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని పౌరసరఫరాలు, బిసి వెల్పేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందులో భాగంగానే వైకుంఠ ధామాల విషయంలోనూ అన్ని మతాల వారికి స్థలాలు కేటాయించి వాటిని ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. బుధవారం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో నగరపాలక సంస్థ నూతనంగా ఆధునీకరించిన వైకుంఠధామాన్ని మంత్రి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలకు గతంలో మానేరు వాగు ఒడ్డున ఒకటే స్మశాన వాటిక ఉండేదని, దీనివల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగే వని గుర్తుచేశారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో మరణించిన వారి అంత్యక్రియలు మంచిగా నిర్వహించేకునేందుకు వీలుగా అన్ని మతాల వారికి వైకుంఠధామాల కోసం స్థలాలు ఇస్తున్నారని తెలిపారు.హౌసింగ్ బోర్డు వద్ద 7 ఎకరాల స్థలంలో రూ. 2.65 కోట్లతో వైకుంఠధామం ఆధునికరించామని మంత్రి పేర్కొన్నారు. అలాగే అలకాపురి కాలనీలో రూ.2 కోట్లు, కార్ఖానా గడ్డ లో రూ.2 కోట్లు, సప్తగిరి కాలనీలో రూ. ఒక కోటి, ముస్లింల కోసం రూ. 50 లక్షలు, క్రైస్తవుల కోసం రూ. 50 లక్షల చొప్పున మొత్తంగా రూ 13. 65 కోట్లతో అన్ని మతాల వారికి వైకుంఠ ధామాలు ఆధునిక రించినట్లు మంత్రి వివరించారు.

Updated Date - 2022-02-23T21:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising