ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిదే:Gangula

ABN, First Publish Date - 2022-07-04T22:56:46+05:30

కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుపై బిజెపి(bjp) జాతీయ కార్యవర్గాల్లో చర్చించక పోవడం శోచనీయమని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుపై బిజెపి(bjp) జాతీయ కార్యవర్గాల్లో చర్చించక పోవడం శోచనీయమని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేంద్రంలో బీసీ మంత్రితత్వ శాఖ ఏర్పాటు, బీసీ కుల గణన, చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు వర్తింపు అంశాలను చర్చించి ఒక డిక్లరేషన్‌ చేస్తారని బీసీ వర్గాలు ఆశించాయి.ఆ మేరకు మోదీ తెలంగాణ వేదికంగా బీసీలకు తీపికబురు చెబుతారని భావించాం. కానీ, బీసీ వర్గాల ఆశలపై నీళ్లు చల్లారని ఆయన అన్నారు.సోమవారం మీడియాతో మాట్లాడిన గంగుల కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.


ఇంతటి ప్రాధాన్యతా అంశాలను ఏమాత్రం చర్చించి డిక్లరేషన్‌ చేయక పోవడం బీసీల పట్ల బీజేపీకి ఎంత కక్ష ఉన్నదో అర్థమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో బీసీల్లో 2,900 కులాలు ఉంటే 2,850కులాలు నేటికి చట్ట సభలకు దూరంగా ఉన్నాయన్నారు. జనాభాలో 65 శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.ఎస్సీ, ఎస్టీలతో ఈబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిని మేము స్వాగతిస్తున్నాం. అయితే అత్యధిక జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంపై మా నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. 


 మాటి మాటికి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు మాట్లాడుతున్నారు. దమ్ముంటే నేను సవాల్‌ విసురుతున్నా. ఒక ఎమ్మెల్యేను ముట్టుకొని చూడండి. పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కూల్చడం మీ వల్ల ఆయ్యే పని కాదు కానీ, మీ ముగ్గురు ఎమ్మెల్యేలను మీరు కాపాడుకోండి చాలు. ఇప్పటికే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తలోదిక్కు వెళ్లడానికి చూస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టింది. తెలంగాణ ప్రజల ఆయుధం ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ గడ్డపై కేసీఆర్‌ ఉన్నంత వరకు బీజేపీ ఏమీచేయలేదని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-04T22:56:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising