ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిసి గురుకుల విద్యార్థుల ప్రతిభ గర్వకారణం: మంత్రి Gangula

ABN, First Publish Date - 2022-06-29T21:07:53+05:30

ఇంటర్(inter mediat result) ఫలితాల్లోమహాత్మా జ్యోతిబాఫూలే(mahatma jyotiba pule) తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ర్యాంకులను కైవసం తనకు గర్వకారణంగా వుందని బిసివెల్ఫేర్ శాఖ మంత్రి గంగుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇంటర్(inter mediat result) ఫలితాల్లోమహాత్మా జ్యోతిబాఫూలే(mahatma jyotiba pule) తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ర్యాంకులను కైవసం తనకు గర్వకారణంగా వుందని బిసివెల్ఫేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు. ఈసందర్భంగా ఆయన ఒక ప్రకటన చేస్తూ ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 93.84 శాతం, మొదటి సంవత్సరం ఫలితాలలో 86.14శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. 950కి పైగా మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య వందకు పైగా ఉందని, 

 

ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు 2755 మంది విద్యార్థులు రాయగా వారిలో 2544 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.మొదటి సంవత్సరం ఫలితాలలో కొత్తగా ప్రారంభించిన ఒకేషనల్ కోర్సులలోనూ విద్యార్థులు తమసత్తా చాటారని చెప్పారు. నాగార్జునసాగర్ లోని గురుకుల కాలేజీ రెండవ, మొదటి సంవత్సరం ఫలితాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు.మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్,  ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య బట్టుఅభినందించారు.

Updated Date - 2022-06-29T21:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising