ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి:Gangula kamalakar

ABN, First Publish Date - 2022-06-11T21:06:31+05:30

అంబేద్కర్ కన్న కలలు దేశంలో ఎక్కడా లేకున్నా తెలంగాణ లో నెరవేరుతున్నాయని బిసి, పౌరసరఫరాల(bc, civil supplies) శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: అంబేద్కర్ కన్న కలలు దేశంలో ఎక్కడా లేకున్నా తెలంగాణ లో నెరవేరుతున్నాయని బిసి, పౌరసరఫరాల(bc, civil supplies) శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు. దళితులు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గంలో దళిత బంధులో (dalita bandhu) భాగంగా తాహెర్ కొండాపూర్ గ్రామానికి కేటాయించిన యూనిట్లను ఎంపీడీవో కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి ద్వారా మన పల్లెలను మన భావితరాలకు అందించడానికి తెచ్చిందే ఈ కార్యక్రమమని అన్నారు.


ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన విద్యుత్ సమస్యలు అన్ని తీర్చేందుకు ఈ రోజు ఎలక్ట్రిక్ డే అని కార్యక్రమం తీసుకోవడం జరిగింది.సబ్ స్టేషన్ లేక విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు.. నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.చాలా ఏళ్లుగా దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనక్కి నెట్టివేయ బడ్డారు..వీరిని ముందుకు తెచ్చి ఆర్ధికంగా సొంత కాళ్లపై నిలబడాలని సీఎం కేసీఆర్ ఈ దళిత బంధు కార్యక్రమం చేపట్టారని అన్నారు.


 దళిత బంధు పథకం భావితరాలకు  దోహదపడుతుంది.ఇద్దరు ముగ్గురు కలిసి ఒక యూనిట్ గా తీసుకొని సమిష్టిగా అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.నిన్నటి వరకు డ్రైవర్లుగా ఉన్నవారు నేడు ఓనర్లు అయ్యారని అన్నారు.అతి త్వరలో గ్రౌండింగ్ అన్నిపూర్తి చేస్తాం.అందరికి ఇవ్వడం జరుగుతుంది.దళిత బంధును యూనిట్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2022-06-11T21:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising