ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంఘటితంగా మున్నూరు కాపులు: మంత్రి Gangula kamalakar

ABN, First Publish Date - 2022-06-06T00:53:20+05:30

తెలంగాణలోని మున్నూరు కాపు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, ఈ నెల 9న హైదరాబాదులోని కోకాపేటలో మున్నూరు కాపు (munnuru kapu)ఆత్మగౌరవ భవన నిర్మాణానికి పూజ నిర్వహించుకుంటున్నట్టు బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలోని మున్నూరు కాపు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, ఈ నెల 9న హైదరాబాదులోని కోకాపేటలో మున్నూరు కాపు (munnuru kapu)ఆత్మగౌరవ భవన నిర్మాణానికి పూజ నిర్వహించుకుంటున్నట్టు బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) తెలిపారు. విద్య, వైద్యం, వ్యాపార తదితర రంగాల్లో మున్నూరు కాపుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభల శక్తిగా ఎదుగుతున్నాయని చెప్పారు. ఆదివారం మంత్రి గంగుల నివాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిద మున్నూరు కాపు సంఘాలు సమావేశమై ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఏకసంఘంగా ఏర్పడే ట్రస్ట్ విధి విధానాలు, భవిష్యత్తులో మున్నూరు కాపుల సంక్షేమం కోసం తీసుకోబోయే చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. 


ఈ నెల 9న ఉదయం మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం భూమి పూజా కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలోని మున్నూరు కాపులందరూ హాజరయ్యే విధంగా సభ నిర్వహిస్తామన్నారు, ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, జిల్లాల కమిటీలు, మండలాల అధ్యక్షులు, మండల కమిటీలు, గ్రామ స్థాయి అధ్యక్షులు, అన్ని గ్రామాల కమిటీలు, నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీలు ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డలు హాజరవ్వాలని మంత్రి గంగుల ఆహ్వానించారు, అల్పాహారం, భోజనం తో పాటు అన్ని ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నామన్నారు. 


కులం అభివ్రుద్ది కోసం, రాబోయే భవిష్యత్ తరాలకు అన్ని విధాలుగా అండగా ఉండడం కోసం మున్నూరుకాపులంతా కలిసికట్టుగా ఉండాలన్నారు. సమాజ శ్రేయస్సును కోరే మున్నూరు కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మేహన్, కాచిగూడ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మానికొండ వెంకటేశ్వరరావు నాయకులు మంగళారపు లక్ష్మణ్, కొండూరి వినోద్, సునీల్ కుమార్, రాష్ట్ర మున్నూరుకాపు సంక్షేమ సంఘం తదితర సంఘాలకు చెందిన నేతలు హాజరయ్యారు.

Updated Date - 2022-06-06T00:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising