ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాల్లో కిలో ధాన్యం కూడా తరుగు తీయోద్దు: మంత్రి గంగుల

ABN, First Publish Date - 2022-04-29T20:17:00+05:30

ఏ రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: ఏ రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఏ రైతు ఇబ్బందులు ఉన్నాయని పిర్యాదు చేయడం లేదని, అనవసర దుష్ప్రచారాలతో రైతులను గందరగోళ పర్చొదన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కిలో కూడా తరుగు తీయొద్దని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక, రైతులు, నేతలు, అధికారులతో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో రైతులు ఎవరూ దళారులకు, మధ్యవర్తులకు అమ్ముకోవద్దని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో 1960 కనీస మద్దతు దర కేటాయించి కొనుగోళ్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 


 రైతులకు అండగా ప్రభుత్వం ఉందని పునరుధ్ఘాటించారు.చాలా మంది అర్థం పర్థం లేని అనవసర ఆరోపణలు చేస్తున్నారని, సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. అందుబాటులో గన్నీ బ్యాగులు లేవని కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని, ఇతర సామాగ్రి సైతం అందుబాటులో లేవని మాట్లాడుతున్నారని ఇవన్నీ అవాస్తవాలన్నారు.ఈ యాసంగిలో 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టినప్పుడే 1 కోటి 60 లక్షల బాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పామని, మొత్తం సివిల్ సప్లైస్ యంత్రాంగం త్వరతిగతిన స్పందించి మిల్లర్లు, రేషన్ డీలర్ల నుండి పాత గన్నీలు సేకరించామన్నారు. అంచనాకు మించి తక్కవ సమయంలోనే గన్నీలు సేకరించిన విషయాన్ని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు 3 కోట్ల గన్నీలు అవసరముంటే నిన్నటివరకే 6 కోట్ల 85 లక్షల గన్నీలు సేకరించి సిద్దంగా ఉంచామన్నారు, 


ఇందులో కొత్తవి 57లక్షలు అందుబాటులో ఉండగా మరో 8.15 కోట్లు కొత్త గన్నీలు అవసరమన్నారు, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసామని, వాటిని కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. తప్పుడు సమాచారం ప్రజలకు దుష్రచారం చేస్తున్న వారికి ఇవ్వొద్దని హితవు పలికారు, అన్ని జిల్లాలకు అవసరమైన గన్నీలు పంపామని, కావాలంటే స్వయంగా చెక్ చేసుకోవాలని, అబద్దాలు ప్రచారం చేయడం తగదన్నారు. దుష్రచారాలు నమ్మెద్దని రైతులకు విజ్ణప్తి చేసారు, ఫెయిర్ ఆవరేజ్ క్వాలిటీతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వండని, అలా ధాన్యం తూకం అయి పోయిన తర్వాత ఇంటికి వెల్లొచ్చన్నారు, ఆ తర్వాత బాధ్యత అధికారులు చూసుకుంటారన్నారు. రైతుకు రైస్ మిల్లులకు సంబందం లేకుండా చూసామన్నారు, ఎక్కడైనా తరుగు తీసే అవకాశం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని, అలా లేని పక్షంలో కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలన్నారు. 

Updated Date - 2022-04-29T20:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising