ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్ షాపుల డిజిటలీకరణ వేగవంతం–మంత్రి గంగుల కమలాకర్

ABN, First Publish Date - 2022-04-23T20:47:53+05:30

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,500 ల రేషన్ షాపుల్ని డిజిటలీకరించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబందించి సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, సర్వీస్ ప్రొవైడర్లతో మంత్రి గంగుల శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,500 ల రేషన్ షాపుల్ని డిజిటలీకరించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబందించి సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, సర్వీస్ ప్రొవైడర్లతో మంత్రి గంగుల శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆధునాతన టెక్నాలజీతో కూడిన ఈ పాస్ యంత్రాలు, ఎలక్ట్రానిక్  వేయింగ్ మెషిన్ల అనుసందానం, వాటి స్టాంపింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని డిపార్మెంట్లు సమన్వయంతో పనిచేసి పూర్తి చేయాలన్నారు. 


వినియోగదారులకు, రేషన్ సరుకులు తీసుకునే 2కోట్ల 87లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, లబ్దీ చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తాధికారులు ఈ నెలలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని 1545 షాపులను అనుసందానించే ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు, రాష్ట్రవ్యాప్తంగా విడుతల వారీగా జూన్ నెలాఖరు కల్లా అనుసందానిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ డీఎల్ఎమ్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అసిస్టెంట్ కంట్రోలర్లు, సీజీజీ డైరెక్టర్, పౌరసరఫరాల అధికారులు, విజన్ టెక్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-23T20:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising