ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 11న జనగామకు సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2022-02-06T20:29:09+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 11న జనగామకు రానున్నారు. ఆయన భారీ బహిరంగ సభలో ప్రసించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 11న జనగామకు రానున్నారు. ఆయన భారీ బహిరంగ సభలో ప్రసించనున్నారు. సీఎం కెసిఆర్ సందర్శన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా జనగామ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి సందర్శించి పరిశీలించారు.పార్టీ కార్యాలయం సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.సభ వేదిక నిర్వహించాల్సిన చోటు, సభ స్థలంలో ప్రజలు తరలి వచ్చే, బయటకు వెళ్ళే దారులని పరిశీలించారు. సభావేదిక నిర్మాణం చేయనున్న వాళ్లకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.


ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... ఆ రోజు సీఎం కేసిఆర్ అన్ని జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ ని ప్రారంభిస్తారని, తర్వాత పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, పార్టీ కార్యాలయం సమీపంలోనే ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడుతారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వస్తారని తెలిపారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 


Updated Date - 2022-02-06T20:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising