ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5వ విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి:మంత్రి Errabelli

ABN, First Publish Date - 2022-05-28T21:17:23+05:30

తెలంగాణలోల 5వ విడత పల్లె ప్రగతిని(palle pragati) విజయవంతం చేయాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర పల్లెలు బాగు పడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: తెలంగాణలోల 5వ విడత పల్లె ప్రగతిని(palle pragati) విజయవంతం చేయాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర పల్లెలు బాగు పడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందని అందుకు తగినట్టుగా ప్రగతి మరింత మెరుగు పెడుతూ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని, ఇందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినయోగం చేసుకోవాలన్నారు. సీఎం కేసిఆర్ ఆదేశానుసారం పల్లె ప్రగతిని విజయవంతం చేసే బాధ్యతను ప్రజా ప్రతినిధులు, అధికారులు తీసుకోవాలన్నారు. వచ్చే నెల 3వ తేదీ నుండి  చేపట్టనున్న 5వ విడత పల్లె ప్రగతి, నాలుగో విడత పట్టణ ప్రగతి సన్నాహక సమీక్ష సమావేశాన్ని మంత్రి జనగామ కలెక్టరేట్ లో శనివారం నిర్వహించారు. 


పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణపై ప్రజా ప్రతినిధులు, అధికారులుతో మంత్రి సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడమే విజయానికి కారణంగా పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో 20 పంచాయతీలు గుర్తింపు పొందగా అందులో 19 పంచాయతీలు జనగామ జిల్లాలో ఉండటం గర్వకారణంగా పేర్కొంటూ అందుకు కారకులైన ప్రతి ఒక్కరిని అభినందించారు.ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ముందుండటం గర్వకారణమన్నారు తండాలు, గూడెంలు ప్రగతి బాట పట్టాయి అంటే ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అన్నారు.


ఇదే తరహాలో చేపట్టిన అభివృద్ధి  కార్యక్రమాలను  వినియోగంలోకి తెస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. అందుకు అవగాహన ఒక్కటే ప్రాధాన్యమని అధికారులు గ్రామస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నిత్యం ఇంటింటికి చెత్త సేకరణ జరగాలని సేకరించిన చెత్త సెగ్రిగేషన్  అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్మి కంపోస్టు చేపట్టి గ్రామ పంచాయతీకి ఆదాయం పెంచాలన్నారు. వైకుంఠ దామాల నిర్వహణ తప్పనిసరిగా జరగాలన్నారు. వైకుంఠధామంలలో పూల మొక్కలతో ఫెన్సింగ్ చేపట్టాలని నీటి సౌకర్యం కల్పించాలన్నారు.పట్టణ ప్రగతిలో రూ.8 కోట్లు డ్రైనేజీలకు కేటాయించడం జరిగిందని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని  అన్నారు.

Updated Date - 2022-05-28T21:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising