ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS news: మండిబజార్‌లో కుప్పకూలిన ఇంటిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-07-23T19:01:22+05:30

జిల్లాలోని మండిబజార్‌లో నేలమట్టమైన ఇంటిని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని మండిబజార్‌లో నేలమట్టమైన ఇంటిని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Errabelli dayakar rao), ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ (Nannapaneni narendar)పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ... వరంగల్‌లో 379 ఇండ్లు శిథిలావస్థలో ఉన్నాయని గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చామని.. వాటిలో ఇప్పటికే 145 పురాతన ఇండ్లు కూల్చేశామని తెలిపారు. నోటిసులు అందుకున్న యజమానులు వారే ఇండ్లను తొలగించుకోవాలని... లేకపోతే జీడబ్య్లూఎంసీ(GWMC) అధికారులే తొలగిస్తారని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇలాంటి సమయంలో సెల్ఫీల కోసం, చేపల కోసం వెళ్లి ప్రాణాల మీదతెచ్చుకోవద్దన్నారు. ప్రాణ నష్టం, ఆస్థి నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివిధాలుగా ఆదుకుంటారని మంత్రి ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు. 


కాగా... ఈరోజు ఉదయం మండిబజార్‌లో పాతభవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఫిరోజ్ అనే యువకుడికి ఈరోజు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అంతలోనే పెను విషాదం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడిన సమక్క అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

Updated Date - 2022-07-23T19:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising