ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS news: గాంధీజీ మార్గం మనందరికీ ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-08-09T17:48:13+05:30

గాంధీజీ మార్గం మనందరికీ ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: గాంధీజీ మార్గం మనందరికీ ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) అన్నారు. 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జనగామ పట్టణంలోని దేవీ థియేటర్‌లో గాంధీ చలనచిత్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఆపై చిన్నారులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి సినిమా చూశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.... స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ మన జాతి పిత అని అన్నారు. ఆయన అత్యంత నిరాడంబరంగా జీవిస్తూనే, అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని తెలిపారు. పిల్లలు ఆయన జీవితాన్ని చదివి, ఇలా సినిమా రూపంలో చూసి నేర్చుకోవాలని సూచించారు. ఆయన చూపిన దారిలోనే సీఎం కేసీఆర్ (CM KCR) గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-09T17:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising