ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఉన్న మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ Birthday Wishes

ABN, First Publish Date - 2022-07-04T20:28:41+05:30

అమెరికాలో జరుగుతున్న ఆటా సభలకు వెళ్లిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి(errabelli dayakar rao) ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) సోమవారం ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అమెరికాలో జరుగుతున్న ఆటా సభలకు వెళ్లిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి(errabelli dayakar rao) ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) సోమవారం ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అలాగే గవర్నర్ తమిళి సై, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లా రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ తదితరులు కూడా మంత్రి ఎర్రబెల్లికి జన్మదిన విషెస్ తెలిపారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి 64వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా వెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే టీ రామారావు కూడా మంత్రికి ఫోన్ చేసి శుభాకాంక్షలు అందచేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళి సై, సీఎం కేసిఆర్, కేటీఆర్, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2022-07-04T20:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising