ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాల పురోగతిపై మంత్రి Errabelli స‌మీక్ష

ABN, First Publish Date - 2022-06-22T20:22:48+05:30

ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాల పురోగతిపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు(errabelli dayakar rao) స‌మీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాల పురోగతిపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు(errabelli dayakar rao) స‌మీక్ష నిర్వహించారు. ఆయా శాఖ‌ల‌ ఉన్న‌తాధికారుల‌తో  హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో స‌మావేశ‌మ‌య్యారు. ఇటీవ‌లి ప‌ల్లె ప్ర‌గ‌తితోపాటు(palle pragati), ఆయా శాఖ‌ల్లో నిర్వ‌హిస్తున్న ప‌లు ప‌నుల పురోగ‌తిపై మంత్రి (review) స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ఆయా ప‌నుల‌కు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.ప‌ల్లె ప్ర‌గ‌తి హామీలు వెంట‌నే చేప‌ట్టాలని,కొత్త సిసి రోడ్లు, గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల నిర్మాణాలు మొద‌లు పెట్టాలని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను ఆదేశించారు. 


స్త్రీ నిధి రుణాల ద్వారా ఇంటింటికీ సోలార్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీని కోసం జిల్లాకు వెయ్యి మంది మ‌హిళా ల‌బ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.ప్ర‌యోగాత్మ‌కంగా మ‌హిళా గ్రూపుల‌కు కుట్టు శిక్ష‌ణ‌,డ్వాక్రా గ్రూపుల ఉత్ప‌త్తుల‌ను ఫ్లిక్ కార్ట్ తో అమ్మ‌కానికి ఒప్పందం చేసుకోవాలన్నారు.స్త్రీ నిధి వేత‌న పెంపు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాలని కూడా అధికారులకు సూచించారు.ఈ స‌మీక్ష స‌మావేశంలో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ హ‌న్మంత‌రావు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, పంచాయ‌తీరాజ్ ఇఎన్‌సి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-22T20:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising