ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో పారిశుద్ధ్యం పై మరింత శ్రద్ధ తీసుకోవాలి:Errabelli

ABN, First Publish Date - 2022-06-12T20:08:57+05:30

గ్రామాల్లో పారిశుద్ధ్యం పై అధికారులు మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండజిల్లా: గ్రామాల్లో పారిశుద్ధ్యం పై అధికారులు మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పారిశుద్ద్యం కోసం పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నదని, ప్రమానికి ప్రత్యేకంగా నిధులను మంజూ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తి పాక  గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి(palle pragati) కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల పల్లెలు ఎంతో పురోగతి సాధిస్తున్నాయని అన్నారు. 


స్ధానిక సమస్యలపరిష్కారానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయని చెప్పారు. గ్రామంలోవాడవాడలా పర్యటించి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రత ను పరిశీలించిన మంత్రి గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ మరింత మెరుగు అవ్వాలని గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బంది ని ఆదేశించారు.అనంతరం జరిగిన గ్రామ సభలో అంశాల వారీగా గ్రామ పరిస్థితులను సమీక్షించారు. 


గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నది? సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? డంపింగ్ యార్డు వినియోగిస్తున్నారా? చెత్త ను ఎరువుగా తయారు చేస్తున్నారా? ట్రాక్టర్, చెత్త ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది? వంటి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు పత్తి పాక గ్రామ పల్లె ప్రగతి లో పాల్గొన్నారు.

Updated Date - 2022-06-12T20:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising